ఇన్వెస్టర్ల ప్యానిక్... భారత స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నిలిపివేత!

  • 10 శాతానికి మించి పతనమైన నిఫ్టీ
  • వెంటనే కల్పించుకున్న సెబీ
  • 9.21 గంటల సమయంలో నిలిచిన ట్రేడింగ్
తమ వద్ద ఉన్న కంపెనీల వాటాలను అమ్మేద్దామని భావించే వారు తప్ప, కొనుగోలు చేయాలని చూసేవారు ఒక్కరూ కనిపించక పోవడంతో, భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచికలు సెన్సెక్స్, నిఫ్టీ ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలో లోయర్ సర్క్యూట్ ను తాకాయి. సూచికలు 10 శాతం పతనం కాగానే, ట్రేడింగ్ ను నిలిపివేస్తున్నట్టు సెబీ వర్గాలు ఆదేశించాయి. సరిగ్గా 9.21 గంటల సమయంలో సెన్సెక్స్ సూచిక 29,687.52 పాయింట్ల వద్ద ఉన్న సమయంలో ట్రేడింగ్ ను నిలుపుదల చేశారు. ఎన్ఎస్ఈ సూచిక 10.07 శాతం పడిపోయి 8,624 పాయింట్ల వద్ద ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది 966 పాయింట్లు తక్కువ.


More Telugu News