కోడికి కరోనా దెబ్బ.. ఉచితంగా పంచేస్తున్న వ్యాపారులు!
- దారుణంగా పడిపోయిన అమ్మకాలు
- కృష్ణా జిల్లా మైలవరంలో ఉచితంగా కోళ్లు
- 2 వేళ కోళ్లను ఉచితంగా పంచిపెట్టిన వ్యాపారి
చికెన్ తింటే కరోనా వైరస్ సోకుతుందన్న వదంతులు పౌల్ట్రీ వ్యాపారాన్ని దారుణంగా దెబ్బతీశాయి. వైరస్ భయంతో చికెన్ ప్రియులు అటువైపు కన్నెత్తి చూసేందుకు కూడా భయపడుతుండడంతో అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. చికెన్ వల్ల వైరస్ వ్యాపించదని అటు ప్రభుత్వాలు, ఇటు వ్యాపారులు ప్రకటనలు ఇస్తున్నా ప్రజల్లో మాత్రం నమ్మకం కలగడం లేదు. చికెన్, గుడ్ల వాడకాన్ని పూర్తిగా తగ్గించేశారు. ఫలితంగా చికెన్ రేట్లు దారుణంగా పడిపోయాయి.
ఏపీలో అయితే కిలో చికెన్ రూ. 20-రూ.40 మధ్య విక్రయిస్తున్నారు. అయినప్పటికీ స్పందన అంతంత మాత్రంగానే ఉండడంతో వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా మైలవరంలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ చికెన్ అమ్మకాలు పూర్తిగా పడిపోవడంతో ఏం చేయాలో పాలుపోని పౌల్ట్రీ వ్యాపారి గువ్వల కుమార్‌రెడ్డి తన ఫాంలోని 2 వేల కోళ్లను సమీప గ్రామాల ప్రజలకు ఉచితంగా పంచిపెట్టారు.