9.5 శాతం పడిపోయిన యూఎస్ మార్కెట్... నేడు మరో బ్లడ్ బాత్ తప్పదా?
- 9.43 శాతం పడిపోయిన నాస్ డాక్
- నిన్నటి భారీ నష్టాలను కొనసాగించిన ఆసియా సూచీలు
- ఇప్పటికే 7 శాతానికి పైగా నష్టంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ
ఓ వైపు కరోనా, మరోవైపు వివిధ దేశాలు తీసుకుంటున్న ట్రావెల్ బ్యాన్ నిర్ణయాలు ప్రపంచ స్టాక్ మార్కెట్ ను ఇప్పటికే కుదేలు చేశాయి. నిన్న వరల్డ్ స్టాక్ మార్కెట్ పాతాళానికి దిగజారగా, నేడూ అటువంటి పతనమే కనిపిస్తోంది. నిన్న అమెరికా సూచిక నాస్ డాక్ 9.43 శాతం పతనమైంది.
ఇక ఈ ఉదయం నిక్కీ 9.27 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 5.94 శాతం, హాంగ్ సెంగ్ 5.49 శాతం, తైవాన్ వెయిటెన్డ్ 6.77 శాతం, కోస్పీ 8.14 శాతం, సెట్ కాంపోజిట్ 10.80 శాతం నష్టాల్లో ఉన్నాయి. షాంగై కాంపోజిట్ 3.20 శాతం పడిపోగా, జకార్తా కాంపోజిట్ 4.51 శాతం నష్టంలో ఉంది.
ఇక ఎస్జీఎక్స్ నిఫ్టీ ఇప్పటికే 7.27 శాతం నష్టాన్ని చూపుతోంది. అంటే, క్రితం ముగింపుతో పోలిస్తే ఇది సుమారు 689 పాయింట్లు తక్కువ. నేటి సెషన్ ఆరంభంలోనే నిఫ్టీ సూచిక అత్యంత కీలకమైన 8,900 స్థాయికన్నా కిందకు పడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే, మదుపరుల సంపద మరో రూ. 9 లక్షల కోట్లు హారతి కర్పూరం అవుతుంది.