కరోనా వ్యాప్తి చైన్ ను తెంపేద్దాం: ప్రధాని మోదీ

  • ఆందోళన వద్దు.. ముందు జాగ్రత్తలు తీసుకుందాం
  • అత్యవసరమైతే తప్ప ఎవరూ విదేశాలకు వెళ్లొద్దు
  • కేంద్ర మంత్రులెవరూ వెళ్లొద్దని చెప్పామన్న ప్రధాని
కరోనా వ్యాప్తి గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని, అందుకు బదులుగా గట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని.. ఈ లింకును తెంపేద్దామని...  కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశముండే భారీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఆయన గురువారం ట్విట్టర్ లో పలు ట్వీట్లు చేశారు.

అనవసర ప్రయాణాలు వద్దు

పలు దేశాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలెవరూ కూడా విదేశీ పర్యటనలు పెట్టుకోవద్దని ప్రధాని మోదీ సూచించారు. అత్యవసరమైతేనే వెళ్లాలన్నారు. విదేశీ పర్యటనలకు వెళ్లవద్దని కేంద్ర మంత్రులకు సూచించామని చెప్పారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు విదేశీయుల వీసాల సస్పెన్షన్ సహా అన్ని చర్యలను కేంద్రం తీసుకుంటోందని తెలిపారు

అప్రమత్తంగా ఉన్నాం

కరోనా గురించి ప్రజలు భయపడ వద్దని, దేశంలో పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. అన్ని రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నామని చెప్పారు. అనుకోని పరిస్థితులు తలెత్తినా.. చికిత్స అందించగలిగేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.


More Telugu News