కరోనా ఎఫెక్ట్​: ఢిల్లీలో స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లు మూసివేత

  • ఈ నెల 31 వరకు మూసే ఉంచాలన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
  • పరీక్షలు జరగాల్సి ఉన్న సెకండరీ తరగతులు మాత్రం కొనసాగింపు
  • ఆస్పత్రుల్లో క్వారంటైన్ సౌకర్యాల ఏర్పాటుకు ఆదేశాలు
కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు ముమ్మరం చేసింది. ఢిల్లీ వ్యాప్తంగా అన్ని స్కూళ్లు, కాలేజీలను మూసివేయాలని ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 31వ తేదీ వరకు మూసే ఉంచాలని, పరిస్థితిని బట్టి దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వార్షిక పరీక్షలు ఉన్న నేపథ్యంలో సెకండరీ (11, 12 క్లాసులు) తరగతులకు మాత్రం బోధన కొనసాగించవచ్చని మినహాయింపు ఇచ్చారు.

సినిమా హాళ్లు కూడా మూసివేత

ఢిల్లీలో కొత్తగా కరోనా వైరస్ కేసులు నమోదైన నేపథ్యంలో కేజ్రీవాల్ ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తో సమావేశమయ్యారు. తర్వాత పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఈ నెల 31వ తేదీ వరకు స్కూళ్లు, కాలేజీలతో పాటు సినిమా హాళ్లను కూడా మూసివేయాలని ఆదేశించారు. ప్రధాన ఆస్పత్రుల్లో తగినన్ని బెడ్లను అందుబాటులో ఉంచాలని, క్వారంటైన్ సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.


More Telugu News