ఇప్పటి వరకూ 400 పైగా స్థానాల్లో నామినేషన్లు వేయనీయకుండా చేశారు: చంద్రబాబు ఫైర్
- రాజకీయ నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు
- చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు
- వైసీపీ ఓడిపోతుందనుకుంటున్న చోట్ల ఎన్నిక నిలిపివేస్తున్నారు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులను, కార్యకర్తలను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారంటూ వైసీపీపై టీడీపీ నేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ అభ్యర్థులకు, కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని, నామినేషన్లు వేయనీయడం లేదని మండిపడ్డారు.
అధికార, వాలంటీర్ల వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. ఎక్కడైతే వైసీపీ నేతలు ఓడిపోతామనుకుంటున్నారో అక్కడ ఎన్నిక నిలిపివేస్తున్నారని, వారి ఇష్టానుసారం ముందుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, రౌడీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో వైసీపీ నాయకులు పేట్రేగిపోయారని ధ్వజమెత్తారు. ఇప్పటివరకూ నాలుగు వందలకు పైగా ఎంపీటీసీ స్థానాల్లో నామినేషన్లు వేయనీయకుండా చేశారని, ఇంకా వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు.