కమల్‌నాథ్‌ సర్కారును బలపరీక్ష కోరనున్న బీజేపీ!

  • ఈనెల 16న బలపరీక్ష నిర్వహించాలని కోరనున్న బీజేపీ
  • తాజా రాజీనామాలతో ఎమ్మెల్యేల సంఖ్య 206 
  • 104 కానున్న మ్యాజిక్ ఫిగర్
  • 107 మందితో బీజేపీ అధికారంలోకి వచ్చే చాన్స్
మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం మరింతగా ముదిరింది. కమల్ నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కారు బలపరీక్షకు నిలబడాల్సి వస్తోంది. 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ప్రమాదంలో పడిన కమల్ సర్కారుకు ఈ నెల 16న బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్‌‌ను కోరుతామని బీజేపీ సీనియర్ నేత నరోత్తమ్ మిశ్రా తెలిపారు. మైనారిటీలో పడిన కాంగ్రెస్ ప్రభుత్వం బల పరీక్షలో నెగ్గకపోతే అధికారం బీజేపీ సొంతమయ్యే అవకాశం కనిపిస్తోంది.

కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడగా, 22 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చశారు. వాళ్ల  రాజీనామాలపై స్పీకర్‌‌, గవర్నర్ నిర్ణయం తీసుకోనునున్నారు. 228 మంది సభ్యులున్న ఎంపీ అసెంబ్లీలో అసంతృత్త నేతల తిరుగుబాటుకు ముందు కాంగ్రెస్ కు 114 మంది సభ్యుల మద్దతు ఉండేది.

ఒకవేళ 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తే.. అసెంబ్లీ  సభ్యుల సంఖ్య 206కు పడిపోతుంది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ గా 104 మంది సభ్యులు అవసరం. కాంగ్రెస్‌కు 92 మంది సభ్యులే మిగులుతారు కాబట్టి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓడిపోనుంది. ఇప్పటికే 107 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఉన్న బీజేపీ సులభంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.


More Telugu News