కరోనాతో వెనుకడుగేస్తున్న ప్రయాణికుల కోసం స్పైస్ జెట్ బంపర్ ఆఫర్
- కరోనా కారణంగా ఖాళీగా తిరుగుతున్న విమానాలు
- ధరలు బాగా తగ్గించిన స్పైస్ జెట్
- దేశీయ టికెట్ రూ.987 నుంచి ప్రారంభం
కరోనా వైరస్ చైనాను దాటి అనేక దేశాలకు విస్తరించిన నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక రంగం కుదేలైంది. ఈ మహమ్మారి భయంతో ఉత్పత్తి, టూరిజం రంగాలు పతనమయ్యాయి. కొన్ని విమానాలు అరకొర ప్రయాణికులతో బోసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో, దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
స్ప్రింగ్ సీజన్ సేల్ లో భాగంగా దేశీయ ప్రయాణాల టికెట్ల ప్రారంభ ధర రూ.987, అంతర్జాతీయ ప్రయాణాల టికెట్ల ప్రారంభ ధర రూ.3,699గా నిర్ణయించారు. ఈ స్పెషల్ సేల్ లో భాగంగా టికెట్లు బుక్ చేసుకున్నవారు వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 లోపు ఎప్పుడైనా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. కాగా, ఈ స్ప్రింగ్ సీజన్ సేల్ మార్చి 12 నుంచి 15వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.