దేశంలో మరింత పెరిగిన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య.. విదేశీ ప్రయాణాలు వద్దని కేంద్ర మంత్రి సూచన

  • దేశంలో మొత్తం 73 పాజిటివ్‌ కేసులు
  • వారిలో 56 మంది దేశీయులే
  • కేరళలో 17 మందికి కరోనా
దేశంలో మొత్తం 73 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపింది. ఢిల్లీలో 6, హర్యానాలో 14, కేరళలో 17, రాజస్థాన్‌లో 3, తెలంగాణలో 1, ఉత్తరప్రదేశ్‌లో 10, లడఖ్‌లో 3, తమిళనాడులో 1, జమ్మూకశ్మీర్‌లో 1, పంజాబ్‌లో 1, కర్ణాటకలో 4, మహారాష్ట్రలో 11 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలిందని తెలిపింది.

దేశంలోని కరోనా పాజిటివ్‌ అని తేలిన వారిలో 56 మంది దేశీయులే ఉన్నారు. భారత్‌లోని విమానాశ్రయాల్లో ఇప్పటి వరకు 10,57, 506 మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. కరోనాపై పార్లమెంటులో విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. 'ఇది ఆందోళనకర విషయం. ఇప్పటివరకు దేశంలో కరోనా సోకిన వారు 73 మంది ఉన్నారు. అసాధారణ పరిస్థితులను అరికట్టడానికి అసాధారణంగానే స్పందన ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి' అని సూచించారు.  


More Telugu News