అందుకే రాజకీయాల్లోకి వస్తున్నాను.. రెండు శక్తిమంతమైన పార్టీలతో తలపడబోతున్నాను: రజనీకాంత్

  • కరుణానిధి, జయలలిత లేకపోవడం వల్లే నేను ప్రజల్లోకి
  • నా వయసు 68 ఏళ్లు
  • నాకు ఇప్పుడు సీఎం పదవి అవసరమా?
  • 2021లో ప్రజలు ఓ విప్లవంలా ప్రభుత్వాన్ని మారుస్తారు
తమిళనాడు రాజకీయాల్లో కరుణానిధి, జయలలిత లేకపోవడం వల్లే తాను ప్రజల్లోకి, రాజకీయాల్లోకి వస్తున్నానని సినీనటుడు రజనీకాంత్ తెలిపారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. 'నా వయసు 68 ఏళ్లు. నాకు ఇప్పుడు సీఎం పదవి అవసరమా? నేను పార్టీపైనే దృష్టి పెడతాను. రాజకీయ పార్టీలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి' అని చెప్పారు.

'తమిళనాడు ప్రజలు ఆనాడు కరుణానిధిని చూసే డీఎంకేకు అవకాశం ఇచ్చారు. 70 శాతం ప్రజలు ఆయనను చూసే ఓటు వేశారు. అదే ఫార్ములాను అన్నాడీఎంకే కూడా అనుసరించింది. నేను సీఎం అభ్యర్థిని కాదు. కాబోయే ముఖ్యమంత్రి రజనీకాంత్‌ అనే నినాదం వద్దు. తమిళనాడులో నేను రెండు శక్తిమంతమైన పార్టీలతో తలపడబోతున్నాను. 2021లో ప్రజలు ఓ విప్లవంలా ప్రభుత్వాన్ని మారుస్తారు' అని రజనీకాంత్ వ్యాఖ్యానించారు.


More Telugu News