కరోనా కోసం... తొలిసారిగా హెఫా ఫిల్టర్లు తెప్పించాలని కేసీఆర్ సర్కారు నిర్ణయం!

  • ఒక్కొక్కటి రూ. 2 కోట్లతో కొనుగోలు
  • కరోనా వైరస్ ను ఒడిసిపట్టే హెపా
  • ఆసుపత్రుల్లో అమర్చాలని నిర్ణయం
కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు కేసీఆర్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్కటి సుమారు రూ. 2 కోట్ల వరకూ వ్యయమయ్యే (హై ఎఫిషియన్సీ పర్టిక్యులేట్ ఎయిర్) హెఫా ఫిల్టర్లను నాలుగింటిని కొనుగోలు చేయాలని, వాటిని గాంధీ ఆసుపత్రి సహా, కరోనా అనుమానితులు అధికంగా ఉండే ఆసుపత్రుల్లో అమర్చాలని నిర్ణయించింది.

ఈ ఫిల్టర్లు వ్యాధిగ్రస్థులు, అనుమానితులు అధికంగా వచ్చి పోతుండే ప్రాంతాల్లో పెట్టడం ద్వారా, వారు తుమ్మినా, దగ్గినా గాల్లోకి వచ్చే వైరస్ ను ఒడిసిపట్టి, స్వచ్ఛమైన గాలిని బయటకు వదులుతూ ఉంటుంది. వీటిని గాంధీ, ఫీవర్, ఛాతీ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డుల వద్ద ఉంచాలని భావిస్తున్నట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యాధి లేదని, ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, వైరస్ వ్యాపించకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.


More Telugu News