వాళ్ల మీద ఇంతింతలావు బండలేస్తారా?: చంద్రబాబునాయుడు
- నిన్న మాచర్లలో ఉమ, బుద్ధాలపై దాడి
- వాహనాన్ని పరిశీలించిన చంద్రబాబు
- చర్యలు తీసుకోవాలని డిమాండ్
నిన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వేస్తున్న నామినేషన్ల కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతున్న పార్టీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై మాచర్లలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పై తీవ్రంగా మండిపడ్డారు.
దాడికి గురైన వాహనాన్ని గత రాత్రి పరిశీలించిన ఆయన, వాహనంలోనే ఉన్న ఓ బండరాయిని తీసి మీడియాకు చూపించారు. ఇంతింతలావు బండలేస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. బుద్ధా వెంకన్న చేతికి అయిన గాయాలను చంద్రబాబు పరిశీలించారు. ఆపై మొత్తం ఘటనలపై పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసి వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.