ఈ ఆర్డినెన్స్ ను వైసీపీ పక్కాగా పాటిస్తే ఎన్నికల తర్వాత జగన్ కు ‘సారీ’ చెప్పేందుకు సిద్ధం: కన్నా
- వైసీపీ అభ్యర్థులు మద్యం, డబ్బు పంచకుండా ఎన్నికల్లో పాల్గొనాలి
- కొత్త చట్టానికి వైసీపీ అభ్యర్థులు కట్టుబడాలి
- లేనిపక్షంలో సీఎంగా ఉండే అర్హత జగన్ కు లేదు
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొత్త చట్టం తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ విమర్శలు గుప్పించారు. వైసీపీ అభ్యర్థులు మద్యం, డబ్బు పంచకుండా ఎన్నికల్లో పాల్గొనాలని సవాల్ విసిరారు. ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సీఎం జగన్ కు చిత్తశుద్ధి ఉంటే దానికి కట్టుబడాలని సవాల్ విసిరారు.
ఈ కొత్త చట్టం ప్రతిపక్షాలను బ్లాక్ మెయిల్ చేయడానికేనని తాను భావిస్తున్నానని, అలా కాకుండా, వైసీపీ పక్కాగా, నిష్పక్షపాతంగా పాటించారని అనిపించుకుంటే, ‘ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ముఖ్యమంత్రికి ‘సారీ’ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా‘ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను ఆ పార్టీ వాళ్లే పాటించని పక్షంలో ముఖ్యమంత్రిగా ఉండే అర్హత జగన్ కు లేదని అన్నారు.