సీఎం జగన్, ఎమ్మెల్యే పిన్నెల్లిపై విరుచుకుపడ్డ బోండా ఉమ
- మాచర్లలో దాడి ఘటనపై మండిపడ్డ బోండా ఉమ
- నీ ఊరొచ్చిన నిరాయుధులను చంపడానికి ప్రయత్నించావు
- జగన్ కు సూటి ప్రశ్న.. నువ్వు చంపుతామంటే మేము పారిపోతామా?
మాచర్ల ఘటన నేపథ్యంలో సీఎం జగన్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేత బోండా ఉమ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ‘రామకృష్ణారెడ్డి.. నీ ఊరొచ్చిన నిరాయుధులను చంపడానికి ‘కొజ్జా’ వాడిలా ప్రయత్నించావు. దమ్ముంటే రా.. చూసుకుందాం. నీ మాచర్లకే వస్తా, రేపే వస్తా. అక్కడే చూసుకుందాం రా’ అంటూ సవాల్ విసిరారు.
‘మీకు ఏంటీ అహంకారం? కండకావరం?’, తెలుగుదేశం పార్టీ ఉండకూడదా? మాజీ అధ్యక్షుడు చంద్రబాబు ఉండకూడదా?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వస్తే చంపుతావా? మమ్మల్ని చంపేందుకు మనుషులను పెడతావా? నీకు సమాచారం ఇచ్చేది లోకల్ పోలీసా? అని ప్రశ్నించారు.
‘ఏమనుకుంటున్నావురా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి? నీకు మళ్లీ చెబుతున్నా. అక్కడికొచ్చి సమాధానం చెప్పగల సత్తా మాకుంది’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని విమర్శించారు.
ఈ సందర్భంగా జగన్ పైనా తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ‘నువ్వు చంపుతామంటే మేము పారిపోతామా? మేము ఇక్కడ పుట్టాం.. పెరిగాం.. ఇక్కడే చస్తాం’ అని అన్నారు. వైసీపీ నేతల దారుణాలపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై సీఎం జగన్, డీజీపీ గౌతం సవాంగ్, రాష్ట్ర ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమకు ప్రాణహాని ఉందని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.