వివేకా హత్యకేసుపై హైకోర్టు తీర్పుతో సీఎం నివాసం కంపించింది: వర్ల
- వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు నిర్ణయం
- ఇది చారిత్రాత్మక తీర్పుగా అభివర్ణించిన వర్ల
- కొందరికి కాళ్లలో వణుకు, వెన్నులో చలి మొదలైందని వ్యాఖ్యలు
టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును చారిత్రాత్మకం అని అభివర్ణించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న న్యాయస్థానం నిర్ణయంతో కొందరికి కాళ్లలో వణుకు, వెన్నులో చలి, కళ్లలో బెరుకు తదితర లక్షణాలు మొదలయ్యాయని వ్యంగ్యం ప్రదర్శించారు. హైకోర్టు తీర్పుతో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం కంపించిపోయిందని, ఈ నిర్ణయం సీఎం జగన్ కు, ప్రభుత్వానికి చెంపదెబ్బ వంటిదని అన్నారు.