కరోనా ఎఫెక్ట్.. జమ్మూకశ్మీర్ లో స్కూళ్లు, కాలేజీలు బంద్

  • మార్చి 31వ తేదీ వరకు అమలు
  • శ్రీనగర్ లో హైఅలర్ట్ ప్రకటించిన కార్పొరేషన్
  • స్టేడియంలు, స్పోర్ట్స్ క్లబ్ లు మూసివేత
  • జనం గుమిగూడే కార్యక్రమాలు చేపట్టొద్దని ఆదేశం
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ లోని చాలా ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలను మూసివేస్తున్నట్టు ప్రకటించారు. శ్రీనగర్ పరిధిలోనైతే స్టేడియంలు, అన్ని రకాల విద్యా సంస్థలతోపాటు ఎక్కువ మంది జనం గుమిగూడే స్టేడియంలు, ఇతర ప్రాంతాలను కూడా గురువారం నుంచి మూసివేయనున్నారు.

లడఖ్ లో బుధవారం నుంచే..

కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన లడఖ్ లో బుధవారం నుంచే యూనివర్సిటీని, కాలేజీలను మూసివేస్తున్నట్టు లడఖ్ విద్యా శాఖ సెక్రెటరీ రిజియాన్ సంఫీల్ ప్రకటించారు. ఈ ప్రాంతంలో స్కూళ్లను వారం రోజుల కిందటే మూసివేశారు. అన్నింటికీ మార్చి 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించామని, ఆ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

శ్రీనగర్ లో హై అలర్ట్..

కశ్మీర్ పరిధిలో ఉన్న శ్రీనగర్ లో కరోనా వైరస్ నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడే ప్రోగ్రామ్ లు చేపట్టవద్దని శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశించింది. మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం కింద అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అన్ని రకాల విద్యా సంస్థలను మూసివేయాలని.. స్పోర్ట్స్ క్లబ్ లు, మైదానాలు వంటివేవీ ఓపెన్ చేయవద్దని ఆదేశించింది. స్కూళ్లు కాలేజీల్లో శానిటైజేషన్, స్టెరిలైజేషన్ చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.


More Telugu News