కర్ణాటకలో కలకలం... రిపోర్టులు వచ్చేలోపే మృతి చెందిన కరోనా అనుమానితుడు

  • సౌదీ నుంచి భారత్ వచ్చిన మహ్మద్ సిద్ధిఖీ అనే వృద్ధుడు
  • కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిక
  • శాంపిల్స్ ను బెంగళూరు ల్యాబ్ కు పంపిన ఆసుపత్రి వర్గాలు
  •  రిపోర్టులు రాకముందే చనిపోవడంతో ఆందోళన
కర్ణాటకలో ఓ కరోనా అనుమానితుడు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మహ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ (76) అనే వృద్ధుడు కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. అతడి నుంచి శాంపిల్స్ సేకరించిన ఆసుపత్రి వర్గాలు వాటిని బెంగళూరు ల్యాబ్ కు పంపాయి. ఆ రిపోర్టులు రాకముందే సిద్ధిఖీ మరణించడం ఆందోళన రేకెత్తిస్తోంది.

కలబుర్గి ప్రాంతానికి చెందిన సిద్ధిఖీ  కొన్నిరోజుల కిందటే సౌదీ అరేబియా నుంచి భారత్ వచ్చాడు. కరోనా లక్షణాలతో బాధపడుతుండడంతో అతడిని కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. అయితే, బ్లడ్ శాంపిల్స్ తాలూకు రిపోర్టులు బెంగళూరు ల్యాబ్ నుంచి రావాల్సి ఉంది. ఈలోపే సిద్ధిఖీ కన్నుమూయడంతో అతడి మరణానికి కారణం ఏంటన్నది తెలియరాలేదు. ఒకవేళ సిద్ధిఖీ కరోనా కారణంగా మరణిస్తే భారత్ లో ఈ మహమ్మారి కారణంగా మృత్యువాత పడిన తొలి వ్యక్తి అవుతాడు.


More Telugu News