ఇద్దర్నీ చంపేయడానికి ప్రయత్నించారు: నారా లోకేశ్

  • మాచర్లలో బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై దాడి
  • వైసీపీ రాక్షసపాలనకు పరాకాష్ఠగా పేర్కొన్న నారా లోకేశ్
  • హైకోర్టు న్యాయవాదిపై ఘోరంగా దాడి చేశారని వెల్లడి
  • బీహార్ కంటే దారుణంగా ఉందని వ్యాఖ్యలు
గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బోండా ఉమ, హైకోర్టు న్యాయవాది కిశోర్ లపై జరిగిన దాడి ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. వైసీపీ రాక్షస పాలనకు మాచర్ల ఘటన పరాకాష్ఠ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో దుర్మార్గం రాజ్యమేలుతోందని, బుద్ధా వెంకన్న, బోండా ఉమలపై వైసీపీ రౌడీ మూకలు దాడికి పాల్పడ్డాయని మండిపడ్డారు.

 ఈ ఘటనలో ఇద్దరు నాయకులను హత్య చేసేందుకు ప్రయత్నించారని, హైకోర్టు న్యాయవాది కిశోర్ పై ఘోరంగా దాడి చేశారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వెయ్యడానికి కూడా వీల్లేదంటూ అరాచకం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి, ఎస్కార్టుగా వచ్చిన పోలీసులపైనా వైసీపీ రౌడీలు దాడి చేసే పరిస్థితి వచ్చిందని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఏపీలో బీహార్ కంటే దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆవేదన వెలిబుచ్చారు.


More Telugu News