ఓడిపోతామన్న భయంతోనే వైసీపీ ఇలాంటి చర్యలకు తెగబడుతోంది: గల్లా జయదేవ్
- రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు
- వైసీపీ కుతంత్రాలకు పాల్పడుతోందన్న గల్లా
- ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని డిమాండ్
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. నామినేషన్ల ఘట్టమే హోరాహోరీగా సాగుతోంది. దీనిపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. విపక్షాల అభ్యర్థులపై దాడులు చేయడం, నామినేషన్ పత్రాలను చించివేయడం, అభ్యర్థులకు కులధ్రువీకరణ, ఇతర క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరించడం వంటి చర్యలతో కుతంత్రాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ఓటమి భయంతోనే వైసీపీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలను అపహాస్యం చేసేలా వైసీపీ చేష్టలున్నాయని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా సాగాలంటే ఈ వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని గల్లా జయదేవ్ ట్వీట్ చేశారు.