వైసీపీ గూండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను: కన్నా లక్ష్మీనారాయణ
- చిత్తూరు జిల్లా పులిచర్ల ఎంపీడీవో కార్యాలయం వద్ద దాడి
- ఐదుగురు బీజేపీ కార్యకర్తలకు గాయాలు
- మండిపడ్డ కన్నా
- వైసీపీ రాక్షస పాలనలో ప్రతిపక్షాలకు రక్షణ ఏది?
చిత్తూరు జిల్లా పులిచర్ల ఎంపీడీవో కార్యాలయం వద్ద బీజేపీ కార్యకర్తలపై దాడి జరిగింది. ఐదుగురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిని పీలేరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడికి పాల్పడింది వైసీపీ కార్యకర్తలని తెలిసింది. నామినేషన్ పత్రాల కోసం బీజేపీ కార్యకర్తలు వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగింది. ఓ కారు ధ్వంసమైంది. దీనిపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ స్పందించారు.
'వైసీపీ రాక్షస పాలనలో ప్రతిపక్షాలకు రక్షణ ఏది? చిత్తూరు జిల్లా పులిచెర్లలో ఎంపీటీసీ ఎన్నికల కోసం నామినేషన్ వేయబోయిన బీజేపీ కార్యకర్తలపై వైసీపీ గుండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. బీజేపీ కార్యకర్తలు ధైర్యంగా ఎన్నికల్లో నిలబడండి, పార్టీ మీకు అండగా ఉంటుంది' అని ఆయన ట్వీట్ చేశారు.