రాహుల్ సిప్లిగంజ్ పై దాడి నిందితుల కోసం పోలీసుల విస్తృత గాలింపు.. బెంగళూరులో ఎమ్మెల్యే సోదరుడు!
- గత బుధవారం గచ్చిబౌలి పబ్‌లో రాహుల్‌పై దాడి
- నిందితుల కోసం గాలిస్తున్న రెండు బృందాలు
- బెంగళూరుకు పారిపోయినట్టు అనుమానం
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై ఇటీవల హైదరాబాదులోని ఓ పబ్‌లో దాడిచేసిన నిందితుల కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. రాహుల్ గత బుధవారం రాత్రి తన స్నేహితులు, గాళ్‌ఫ్రెండ్‌తో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు వెళ్లాడు. పబ్‌లోని కొందరు యువకులు రాహుల్ వెంట వచ్చిన యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో రాహుల్ వారిని నిలదీశాడు. అది క్రమంగా గొడవకు దారితీసింది. దీంతో ఆగ్రహం పట్టలేని యువకులు బీరు సీసాలతో రాహుల్ తలపై కొట్టడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.
రాహుల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎస్ఓటీ, గచ్చిబౌలి పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సోదరుడు రితీశ్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు బెంగళూరుకు పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు వారి కోసం అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. కాగా, నిందితులు అక్కడి నుంచి ముందస్తు బెయిలు కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.