27 నుంచి తమిళనాడులో కొత్త సినిమాలు బంద్!
- నిర్ణయించిన సినీ పంపిణీదారుల సంఘాల సమాఖ్య
- సినిమా టికెట్లపై జీఎస్టీ, ఎల్బీటీలతో ప్రేక్షకులకు భారం
- రద్దు చేయాలని డిమాండ్ చేసిన టి.రాజేందర్
తమిళనాడులోని సినీ పంపిణీదారుల సంఘాల సమాఖ్య కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27వ తేదీ నుంచి కొత్త సినిమాలను విడుదల చేయరాదని నిర్ణయించినట్టు సంఘం అధ్యక్షుడు టి.రాజేందర్ తెలిపారు. పంపిణీదారుల ఆదాయంలో పదిశాతం పన్ను మినహాయింపు ఇవ్వాలని సంఘంలో తీర్మానం చేసినట్టు చెప్పారు.
సినిమా టికెట్లపై 12 శాతం జీఎస్టీ వసూలు చేయడమే కాకుండా స్థానిక సంస్థల కోసం 8 శాతం ఎల్బీటీ పన్నును కూడా వసూలు చేస్తున్నారని అన్నారు. ఇలా చేయడం వల్ల ప్రేక్షకులపై భారం పడుతోందని, ఈ కారణంగానే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఈ పన్నును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.