పెళ్లి మాత్రమే... వెంటనే హనీమూన్ మాత్రం లేదని వాపోయిన హీరో నిఖిల్!
- ఏప్రిల్ 16న నిఖిల్ వివాహం
- వధువు భీమవరానికి చెందిన డాక్టర్ పల్లవి
- ప్రస్తుతం కార్తికేయ సీక్వెల్ లో నిఖిల్ బిజీ
- షూటింగ్ తరువాతనే హనీమూన్
వచ్చే నెల 16వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన డాక్టర్ పల్లవీ వర్మను వివాహం చేసుకోనున్న నిఖిల్ ముందు ఇప్పుడు ఓ సమస్య వచ్చి పడింది. పెళ్లి అయితే చేసుకుంటున్నాడు కానీ, వెంటనే హనీమూన్ కు వెళ్లే అవకాశం నిఖిల్ కు లేదట. ఈ విషయాన్ని అతనే స్వయంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.
ఇంతకీ హనీమూన్ కు వెళ్లలేకపోవడానికి కారణం ఏంటంటే, 2014లో మిస్టరీ థ్రిల్లర్ గా వచ్చి మంచి విజయం సాధించిన 'కార్తికేయ' చిత్రానికి సీక్వెల్ గా ఓ చిత్రం షూటింగ్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. దసరాకు సినిమాను విడుదల చేయాలని యూనిట్ భావిస్తూ ఉండటంతో, షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది. దీంతో బిజీ అయిపోయిన నిఖిల్, పెళ్లికి కేవలం వీకాఫ్ తీసుకుని మాత్రమే హాజరయ్యే పరిస్థితి.
తనకిప్పుడు చేతినిండా పని ఉందని, అందుకే హనీమూన్ ను వాయిదా వేశానని, షూటింగ్ పూర్తయిన తరువాత మాత్రమే హనీమూన్ కు వెళతానని నిఖిల్ చెబుతున్నాడు. ఇటీవల కార్తికేయ సీక్వెల్ కాన్సెప్ట్ వీడియో విడుదల కాగా, అది వైరల్ అయింది. ఈ సినిమాలో సైతం స్వాతి నటిస్తుండగా, మరో హీరోయిన్ పాత్ర కోసం అన్వేషణ జరుగుతోంది.
ఇక ఈ సినిమాలో దాదాపు 5 వేల ఏళ్ల నాటి రహస్యాలను ప్రస్తావించబోతున్నామని, సంప్రదాయాలు, చరిత్రలను ఎలా మరచిపోతున్నామన్న విషయమై చర్చ కూడా ఉంటుందని, కార్తికేయలో మాదిరిగానే, ఇందులోనూ భగవంతుడు ఉంటాడని, శ్రీ కృష్ణుడి కథ తెరపై కనిపిస్తుందని నిఖిల్ చెప్పాడు.