ఐపీఎల్‌ను అడ్డుకోవాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్

  • వైరస్ ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధిలా విస్తరిస్తోంది
  • బీసీసీఐకి అనుమతి ఇవ్వకుండా కేంద్రాన్ని అడ్డుకోండి
  • ఈ వైరస్ నివారణకు ఇంకా ఔషధం కనుక్కోలేదు
దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడంతో ఐపీఎల్ నిర్వహించకుండా అడ్డుకోవాలంటూ చెన్నైకి చెందిన న్యాయవాది ఒకరు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 29 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖడేలో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, గత సీజన్ ఫైనలిస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి.

అయితే, ప్రాణాంతకమైన కరోనా వైరస్ అంటువ్యాధిలా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోందని, కాబట్టి ఐపీఎల్‌ నిర్వహించేందుకు బీసీసీఐకి కేంద్రం అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవాలని కోరుతూ న్యాయవాది జి. అలెక్స్ బెంజిగర్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. కోవిడ్-19 నివారణకు ఔషధం కనుగొన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా ప్రకటించలేదని  పిటిషన్‌దారు పేర్కొన్నారు.


More Telugu News