టీడీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను మంత్రి జయరాం అనుచరులు చించేశారు: లోకేశ్ ఫైర్
- పోలీస్, రెవెన్యూ అధికారులను కోట్ల సుజాతమ్మ నిలదీశారు
- పలాస నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారు
- కృష్ణా జిల్లాలోనూ అదే పరిస్థితి
కర్నూలు జిల్లాలో టీడీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు చించివేయడంపై నారా లోకేశ్ స్పందించారు. ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి రజని నామినేషన్ పత్రాలను జయరాం అనుచరులు చించి వేసి, ఆమెను, వెంట ఉన్న వారిని తరిమేశారని ఓ పోస్ట్ లో మండిపడ్డారు. వారికి వత్తాసు పలికిన పోలీసులు, రెవెన్యూ అధికారులను టీడీపీ నాయకురాలు కోట్ల సుజాతమ్మ నిలదీశారని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా జతపరిచారు.
శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలంలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని మరో ట్వీట్ లో ఆరోపించారు. వైసీపీ నేతల ఆదేశాలతో ప్రభుత్వ సిబ్బంది హెల్త్‌కార్డులు పంపిణీ చేశారని, దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కృష్ణా జిల్లాలో ఎన్నికల కోడ్ ప్రకారం ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ విగ్రహాలకు ముసుగులు వేసిన అధికారులు రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి ఎందుకు వేయలేదు? అని లోకేశ్ ప్రశ్నించారు.