ఎన్నికల్లో గెలవలేమనే వైసీపీ నేతలు వాయిదా వేయించారు: యనమల

  • ఈసీ షెడ్యూల్ ప్రకటించాక ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారన్న యనమల
  • ఎన్నికలు వాయిదా వేసే అధికారం కలెక్టర్లకు లేదని వెల్లడి
  • ప్రభుత్వం చేతిలో కలెక్టర్లు పావులుగా మారారని విమర్శలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేమని భావించే వైసీపీ నేతలు కొన్నిచోట్ల ఎన్నికలు వాయిదా వేయించారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించాక వాయిదా వేసే అధికారం కలెక్టర్లకు లేదని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో 8 జడ్పీటీసీ, 345 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు ఏ విధంగా నిలిపివేస్తారని ప్రశ్నించారు. పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వం చేతిలో కలెక్టర్లు పావులుగా మారినట్టుందని వ్యాఖ్యానించారు. పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు చేస్తూ వైసీపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడం పైనా యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆర్డినెన్స్ చెల్లదని, దీనిపై టీడీపీ న్యాయపోరాటం చేస్తుందని అన్నారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలకు ప్రజలే బుద్ధి చెప్పాలని, ప్రతిచోట వైసీపీ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు.


More Telugu News