ఏపీలో ‘స్థానిక’ ఎన్నికల కోడ్​ సీఎం జగన్​ కు వర్తించదా?: చంద్రబాబునాయుడు

  • ‘జగనన్న విద్యా కానుక’ గురించి సీఎం ఇవాళ ప్రస్తావించారు
  • విద్యార్థులకు ఇచ్చే వస్తువుల గురించి ఎలా మాట్లాడతారు?
  • ‘స్థానిక’ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలను వదలిపెట్టం
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ సీఎం జగన్ కు వర్తించదా? అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పాఠశాల వసతుల కల్పనపై సీఎం జగన్ ఇవాళ మాట్లాడటంపై విమర్శలు గుప్పించారు. ‘జగనన్న విద్యా కానుక’ కింద విద్యార్థులకు ఇచ్చే వస్తువుల గురించి ఆయన ఏ విధంగా మాట్లాడతారు? అని ప్రశ్నించారు.

స్థానిక ఎన్నికల్లో వైసీపీ అక్రమాలను వదలిపెట్టమని హెచ్చరించారు. ఈ ఎన్నికలు సక్రమంగా జరిగేలా రాష్ట్ర ఎన్నికల సంఘం చూడాలని కోరారు. నామినేషన్లు వేసే అభ్యర్థులకు తగిన సమయానికి కుల ధ్రువీకరణపత్రం ఇవ్వకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘమే దానికి బాధ్యత వహించాలని అన్నారు. మంత్రాలయం, సూళ్లురుపేట, రేపల్లె, నగరిలో తమ అభ్యర్థులపై వైసీపీ దౌర్జన్యాలు ఎక్కువైపోయాయని, కేసుల పేరిట బెదిరిస్తున్నారని, ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలు ఎక్కువైపోయాయంటూ మరోమారు ఆయనపై విరుచుకుపడ్డారు.


More Telugu News