బాలకృష్ణను వదిలి వెళ్లాలంటే నాకు బాధగా ఉన్నా తప్పలేదు: కదిరి బాబూరావు
- ఎన్టీఆర్, బాలకృష్ణలు దేవుడి లాంటి వ్యక్తులు
- బాలకృష్ణపై అభిమానంతోనే ఇన్నాళ్లూ టీడీపీలో కొనసాగా
- బాలకృష్ణ అమాయకుడు.. ఆయన్ని ఏ విధంగా చంద్రబాబు మోసం చేస్తారో?
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనకు నమ్మకం ద్రోహం చేసినప్పటికీ ఇన్నాళ్లూ తాను తెలుగుదేశం పార్టీలో కొనసాగడానికి కారణం నందమూరి బాలకృష్ణపై ఉన్న అభిమానంతోనే అని ఇవాళ వైసీపీ లో చేరిన కదిరి బాబూరావు అన్నారు. వైసీపీలో చేరిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, 2014లో తనకు వైసీపీ నేతల నుంచి పిలుపు వచ్చిందని, అయితే, బాలకృష్ణతో తనకు ఉన్న స్నేహం, సత్సంబంధాలు, ఆయనపై తనకు ఉన్న నమ్మకంతోనే టీడీపీలో కొనసాగాల్సి వచ్చిందని అన్నారు.
2019 ఎన్నికల్లో తనను కనిగిరికి బదులు దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేయించిన విషయమై చంద్రబాబుకు బాలకృష్ణ చెప్పినా పట్టించుకోలేదని విమర్శించారు. బాలకృష్ణను వదిలి వెళ్లాలంటే తనకు బాధగా ఉంది కానీ, చంద్రబాబును నమ్మే పరిస్థితిలో లేనని, అక్కడ ఇమడలేనని చెప్పారు. బాలకృష్ణ చాలా మంచి వ్యక్తి అని, ఎన్టీఆర్, బాలకృష్ణలు చంద్రబాబు లాంటి వాళ్లు కాదని ‘హండ్రెడ్ పర్సంట్‘ చెప్పగలనని అన్నారు. ఎన్టీఆర్, బాలకృష్ణలు దేవుడి లాంటి వ్యక్తులను కొనియాడారు. బాలకృష్ణ అమాయకుడని, ఆయన్ని ఏ విధంగా చంద్రబాబు మోసం చేస్తారో? అంటూ విమర్శలు గుప్పించారు.