మద్యం, డబ్బులు పంపిణీ చేయడం ‘జగనన్న’ మొదలు పెట్టారు: నారా లోకేశ్ ఆరోపణ
- వైసీపీ అరాచకాలను ‘పసుపు సైనికులు’ ప్రపంచానికి చూపించాలి
- ఈ ఎన్నికలు జగన్ దొంగల బ్యాచ్ కు జీవన్మరణ పోరాటం
- ‘బ్లాక్ మీడియా’ ఓ గుంట నక్కలా ఎదురుచూస్తోంది
ఏపీ సీఎం జగన్, ఆయన పరిపాలనపై టీడీపీ నేత నారా లోకేశ్ వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తమ వాలంటీర్లతో మద్యం, డబ్బులు పంపిణీ చేయడం ‘జగనన్న’ మొదలు పెట్టారని ఆరోపించారు. వైసీపీ అరాచకాలను ‘పసుపు సైనికులు’ ఎప్పటికప్పుడు ప్రపంచానికి చూపించాలని పిలుపు నిచ్చారు.
వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని కాలర్ ఎగరేసి పది నెలలు కూడా కాకముందే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవకపోతే ‘తాటతీస్తా’ అనే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో పాలన ఎంత దరిద్రంగా ఉందో జగనే ఒప్పుకున్నాడని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు జగన్ దొంగల బ్యాచ్ కు జీవన్మరణ పోరాటంగా మారిందని అన్నారు.
వైసీపీ చేసే చెత్త పనులను తమపై నెట్టేందుకు ‘బ్లాక్ మీడియా’ ఓ గుంట నక్కలా ఎదురుచూస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.