మంత్రులకు వార్నింగ్ ఇచ్చిన సీఎం దేశంలోనే లేడు: కేశినేని నాని
- గెలవకపోతే పదవులు పోతాయని మంత్రులను బెదిరిస్తున్నారన్న నాని
- ఎస్పీలను కూడా బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపణ
- నామినేషన్లు వేయకుండా విపక్ష అభ్యర్థులను అడ్డుకుంటున్నారని ఆవేదన
స్థానిక సంస్థల ఎన్నికల ఊపు మొదలైన నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. ఇలాంటి స్థానిక ఎన్నికలను గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. గెలవకపోతే మంత్రి పదవులు పోతాయని బెదిరిస్తున్నారని, మంత్రులకు వార్నింగ్ ఇచ్చిన సీఎం దేశంలో మరెవరూ లేరని విమర్శించారు.
ఆఖరికి జిల్లా ఎస్పీలను కూడా బెదిరిస్తున్నారని, పులివెందుల సంస్కృతిని రాష్ట్రమంతటా తెస్తున్నారని నాని ఆరోపించారు. నామినేషన్లు వేయకుండా ప్రతిపక్షాల అభ్యర్థులపై బెదిరింపులకు పాల్పడే పరిస్థితి కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో కుంటిసాకులతో ఎన్నికలు ఆపేశారని మండిపడ్డారు.