డబ్బు చాలా అవసరమే అయినా ఆ పాత్రను చేయలేదు: నటి తులసి
- ఓ పెద్ద సినిమాలో ఛాన్స్ వచ్చింది
- పెద్ద మొత్తంలో ఆఫర్ చేశారు
- ఆ పాత్ర చేయనన్నానన్న తులసి
నటిగా వివిధ భాషల్లో మంచి పేరు తెచ్చుకున్న తులసి, ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. "మా అమ్మమ్మ వాళ్లది శ్రీమంతుల కుటుంబమే. అయితే చెన్నై వచ్చిన తరువాత మా అమ్మ దానధర్మాలు ఎక్కువగా చేసేది. ఇంట్లో చాలామంది పనివాళ్లు ఉండేవారు. ఈ కారణంగా ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది.
అలాంటి పరిస్థితుల్లోనే ఒక పెద్ద బ్యానర్లో ఒక సినిమా చేయవలసి వచ్చింది. స్కిన్ షో చేయవలసిన పాత్ర అది. పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానన్నారు. అప్పుడు డబ్బు చాలా అవసరం కావడంతో, ఆలోచించుకోమని మా పెదనాన్న వాళ్లు అన్నారు. ఆ పాత్ర చేయడం నాకు ఇష్టంలేదు. ఎలాగో అప్పుడప్పుడు గంజి తాగుతున్నాం గదా .. మరో రెండు రోజులపాటు కూడా గంజే తాగుదాం అన్నాను. మా ఇంట్లో వాళ్లెవరూ నన్ను ఫోర్స్ చేయలేదు. ఆ పాత్ర చేయకపోవడం నా కెరియర్ కి మంచిదే అయింది" అని చెప్పుకొచ్చారు.