నా స్వయంవరంలో ఈ ముగ్గురు ఉండాలని కోరుకుంటా: తమన్నా

  • మీ స్వయంవరంలో ఏ హీరోలు ఉండాలని అడిగిన మీడియా ప్రతినిధి
  • ప్రభాస్, విక్కీ కౌశల్, హృతిక్ రోషన్ ఉండాలన్న తమన్నా
  • హృతిక్ తో ముద్దు సీన్లకైనా రెడీ అంటూ సరదా వ్యాఖ్యలు
మిల్కీ బ్యూటీ తమన్నా వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని సోకుతో అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమ్మడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మీకే గనుక స్వయంవరం ఏర్పాటు చేస్తే అందులో ఏ హీరోలు ఉండాలని కోరుకుంటారు? అని ప్రశ్నించగా, ప్రభాస్, విక్కీ కౌశల్, హృతిక్ రోషన్ తప్పకుండా ఉండాలని కోరుకుంటానని వెల్లడించింది.

ఈ ముగ్గురూ తన అభిమాన హీరోలని స్పష్టం చేసింది. వీరిలో హృతిక్ రోషన్ తో తాను ముద్దు సీన్లలో నటించేందుకైనా సిద్ధమేనని తన అభిమానం ప్రదర్శించింది. సాధారణంగా తాను సినిమాల్లో కిస్సింగ్ సీన్లకు దూరంగా ఉంటానని, ఆ మేరకు ముందే ఒప్పందం కుదుర్చుకుంటానని, హృతిక్ తో చేయాల్సి వస్తే ఆ ఒప్పందాన్ని పక్కనపెట్టేస్తానని సరదాగా వ్యాఖ్యానించింది. బాహుబలి తర్వాత తమన్నా పెళ్లి చేసుకుంటుందని అనేక కథనాలు వచ్చాయి. ఆమె తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారని ప్రచారం జరిగినా ఆ వార్తలను తమన్నా అంగీకరించలేదు.


More Telugu News