కుప్పకూలనున్న మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం?.. ఆరుగురు మంత్రులు సహా 19 మంది ఎమ్మెల్యేల రాజీనామా

  • గవర్నర్‌కు రాజీనామా లేఖలు పంపిన నేతలు
  • ప్రస్తుతం బెంగళూరులో 19 మంది ఎమ్మెల్యేలు
  • తమ నేతలతో బీజేపీ, కాంగ్రెస్ చర్చోపచర్చలు
మధ్యప్రదేశ్‌లో పరిణామాలు రాజకీయ సంక్షోభం దిశగా వెళ్తున్నాయి. కాంగ్రెస్ కీలక నేత సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. వారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన లేఖను తమ రాష్ట్ర గవర్నర్‌కు వారు పంపారు.

ప్రస్తుతం వీరంతా బెంగళూరులో ఉన్నారు. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కుప్పకూలే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక బీజేపీ నేతలు వీరి వసతి సౌకర్యాలు పర్యవేక్షిస్తున్నట్లు ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంటోన్న రాజకీయ పరిణామాలపై బీజేపీ, కాంగ్రెస్ కీలక నేతలు చర్చోపచర్చల్లో పాల్గొంటున్నారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో ఆ పార్టీ నేతలు దిగ్విజయ్‌ సింగ్‌, జితు పట్వారీతో పాటు పలువురు సమావేశమయ్యారు.


More Telugu News