కేరళలో మరో ఆరుగురికి కరోనా.. కర్ణాటకలోనూ నలుగురికి సోకిన వైనం.. దేశంలో పెరిగిన కేసులు
- కేరళలో కరోనా సోకిన వారి సంఖ్య 12కు పెరిగిన వైనం
- ప్రకటించిన సీఎం పినరయి విజయన్
- దేశంలో మొత్తం 50 మందికి పైగా కరోనా పాజిటివ్
కేరళలో మరో ఆరుగురికి కరోనా వైరస్ సోకిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. దీంతో తమ రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 12కు పెరిగిందని చెప్పారు. ఈ నెల 31 వరకు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు తరగతులు, పరీక్షలను నిర్వహించకూడదని ఆదేశించారు. 8, 9, 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు షెడ్యూలు ప్రకారమే జరుగుతాయని చెప్పారు. అన్ని ట్యూషన్ క్లాసులు, అంగన్వాడీలు, మదర్సాలను ఈ నెల 31వరకు మూసేస్తున్నట్లు ప్రకటించారు.
కాగా, కర్ణాటకలో నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలిందని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి బి.శ్రీరాములు ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులనూ పరీక్షిస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పౌరులంతా సహకరించాలని కోరారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మరింత పెరిగాయి. దాదాపు 50 మందికి పైగా కరోనా పాజిటివ్ అని తేలింది.