'కరోనా' భయంతో.. కాశీ విశ్వనాథ ఆలయంలో దేవుడి ముఖానికి మాస్క్ పెట్టిన వైనం
- దేవుడికి కరోనా సోకకుండా ఉండడానికి పూజారుల చర్య
- ఆయనను తాకొద్దని కండీషన్
- ప్రజల్లో అవగాహన తెచ్చేందుకే ఇలా చేస్తున్నామని వ్యాఖ్య
విశ్వంలోని సకల చరాచర సృష్టి భగవంతుడి వల్లే జరిగిందని ఆస్తికుల నమ్మకం. అటువంటి దేవుడికీ కరోనా వైరస్ సోకుతుందని కొందరు భయపడుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలోని విశ్వనాథ్ ఆలయంలో దేవుడి విగ్రహానికి మాస్క్‌లు పెట్టడం విస్మయం కలిగిస్తోంది.
దేవుడికి కరోనా సోకకుండా ఉండడానికి భక్తులెవరూ ఆయనను తాకొద్దని పూజారులు కండీషన్ పెట్టారు. దీనిపై కొందరు భక్తులు పూజారులను నిలదీశారు. ప్రజల్లో అవగాహన తెచ్చేందుకే ఇలా చేస్తున్నామని వారు చెప్పుకొచ్చారు. భక్తులు తమ చేతులలో విగ్రహాన్ని తాకితే వైరస్ వ్యాప్తి చెందుతుందని అన్నారు.
మళ్లీ ఆ విగ్రహాన్ని ఇతరులు తాకినా వారికీ ఈ వైరస్ వస్తుందని చెప్పారు. దేవుడికి మాస్క్ వేసిన దృశ్యాలను కొందరు భక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'కరోనాను సృష్టించేదే దేవుడు.. దేవుడికి కరోనా సోకడమేంటీ?' అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతటి అజ్ఞానంలో ప్రజలు బతుకుతున్నారని మండిపడుతున్నారు.