దమ్ముంటే ఈ పని చేసి ఎన్నికలు నిర్వహించాలి: బుద్ధా వెంకన్న సవాల్‌

  • వైఎస్‌ జగన్‌ గారు ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చారా?
  • వాటిని దేశమంతా ఆసక్తిగా గమనిస్తుందా?
  • వాలంటీర్లతో జగనన్న మద్యం, డబ్బు  డోర్ డెలివరీ
  • ఈ నెల జగనన్న మద్యం దుకాణాలు మూసేయాలి
'సీఎం జగన్ గారు అత్యంత సాహసంతో తీసుకొచ్చిన ఎన్నికల సంస్కరణలను దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది' అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్‌ ఇచ్చారు.

'వైఎస్‌ జగన్‌ గారు ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చారా? వాటిని దేశమంతా ఆసక్తిగా గమనిస్తుందా? జగనన్న మద్యం దుకాణాలు ప్రారంభించి ఎన్నికల్లో మద్యాన్ని ఏరులై పారించడాన్ని సంస్కరణ అంటారా?' అని ప్రశ్నించారు.

'దేవుడి స్క్రిప్ట్ అంటూ కబుర్లు చెప్పి ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలను సంతలో పశువుల్లా కొనడాన్ని దేశమంతా ఆసక్తిగా చూస్తుందా? వాలంటీర్లతో జగనన్న మద్యం, డబ్బు డోర్ డెలివరీ చేస్తున్నందుకు ఆదర్శంగా తీసుకోవాలా సాయిరెడ్డి గారు?' అని నిలదీశారు.  

'5 కోట్ల ఆంధ్రులు తుగ్లక్ అని నినదిస్తుంటే పలాయనం చిత్తగించి గెలవకపోతే దించేస్తా అని నాయకులను బెదిరించే దుస్థితికి చేరుకున్నాడు జగన్. దమ్ముంటే ఈ నెల జగనన్న మద్యం దుకాణాలు మూసేసి ఎన్నికలు నిర్వహించాలి' అని బుద్ధా వెంకన్న సవాలు విసిరారు.


More Telugu News