విశాఖకు 20 వేల కోట్లు కేటాయించాలి: హైదరాబాద్‌కు 10 వేల కోట్ల కేటాయింపుపై ఐవైఆర్ స్పందన
- హైదరాబాద్ పై పెట్టుబడి తెలంగాణ భవితకు పెట్టుబడవుతుంది
- విశాఖపై పెట్టుబడి ఆంధ్ర భవితకు పెట్టుబడి అవుతుంది
- మౌలిక సదుపాయాలు పెరుగుతాయి
హైదరాబాద్ నగరాభివృద్ధికి రూ.10 వేల కోట్లను కేటాయిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగం సందర్భంగా తెలంగాణ మంత్రి హరీశ్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు.. విశాఖపట్నం అభివృద్ధికి రూ.20 వేల కోట్లయినా కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
'హైదరాబాద్ పై పెట్టుబడి తెలంగాణ భవితకు, విశాఖపై పెట్టుబడి ఆంధ్ర భవితకు పెట్టుబడి అవుతుంది. మౌలిక సదుపాయాలు పెరిగి పెట్టుబడులు పెట్టడానికి సరైన ప్రదేశాలుగా గుర్తించినప్పుడే రాష్ట్రాల ఆదాయాలు పెరుగుతాయి. ఆంధ్ర బడ్జెట్ లో విశాఖకు ఈ దామాషాలో 20 వేల కోట్లు అయినా కేటాయించాల్సిన అవసరముంది' అని చెప్పారు.