హోలిక కాదు... కరోనాసుర దహనం!
- చెడుపై సాధించిన విజయానికి గుర్తుగా హోలీ
- కరోనాసురుడి దిష్టి బొమ్మల దగ్ధం
- 105 దేశాలకు విస్తరించిన వైరస్
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే హోలీ వేడుకల్లో ఈ సంవత్సరం చాలా ప్రాంతాల్లో హోలికా రాక్షసి బదులు కరోనాసురుడు వచ్చాడు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వెంటనే పారిపోవాలని కోరుతూ, పలు చోట్ల కరోనాసుర దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు.
ముంబైలోని వర్లి ప్రాంతంలో స్థానికులు తయారు చేసిన కరోనాసుర దిష్టిబొమ్మ అందరినీ ఆకర్షించింది. భారీ దిష్టిబొమ్మను ఏర్పాటు చేసిన ప్రజలు, దాన్ని దగ్ధం చేసి, ఇక, కరోనాసురుడు చచ్చిపోవాల్సిందేనంటూ నినాదాలు చేశారు. కాగా, చైనాలోని వూహాన్ లో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్, ఇప్పటికే 105 దేశాలకు విస్తరించగా, 3,800 మంది వరకూ మృత్యువాత పడ్డారన్న సంగతి తెలిసిందే.