హోలీ లేదు... మరేం ఫర్వాలేదు: చంద్రబాబు
- హోలీకి కరోనా అడ్డు
- బోసిపోయిన వీధులు
- ట్విట్టర్ లో చంద్రబాబు ట్వీట్లు
రంగుల పండగ హోలీకి ఈ సంవత్సరం కరోనా వైరస్ అడ్డు తగిలింది. రంగులతో నిండిపోవాల్సిన వీధులన్నీ బోసిపోయాయి. ఇక ఇదే విషయాన్ని ప్రస్తావించిన ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, తన ట్విట్టర్ ఖాతాలో ఓ ప్రత్యేక ట్వీట్ పెట్టారు.
"హోళీ పండుగ వచ్చిందంటే ఆ ఉత్సాహం ఎంత రంగులమయంగా ఉంటుందో మనందరికీ తెలుసు. కానీ ఈసారి ఆ ఉత్సాహాన్ని కరోనా వైరస్ భయం నీరుగార్చింది. మరేం పరవాలేదు. హోళీ ప్రతి సంవత్సరం వస్తుంది. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పండుగని జరుపుకోండి. ప్రజలందరికీ హోళీ శుభాకాంక్షలు" అని ఆయన అన్నారు.