రిలయన్స్ పతనం టీసీఎస్ కు కలిసొచ్చింది... దేశంలోనే నెంబర్ వన్ కంపెనీ ఇదే!
- అంతర్జాతీయంగా పడిపోయిన చమురు ధరలు
- రూ.10 లక్షల కోట్ల నుంచి రూ.7.05 లక్షల కోట్లకు పడిపోయిన రిలయన్స్
- 13 శాతం పతనమైన షేరు విలువ
- రూ.7.40 లక్షల కోట్లతో అగ్రస్థానంలో టీసీఎస్
అంతర్జాతీయంగా చమురు ధరలు దారుణంగా పడిపోవడంతో రిలయన్స్ కంపెనీ షేర్లు కుదేలయ్యాయి. రిలయన్స్ షేరు 13 శాతం పతనమైంది. దాంతో రిలయన్స్ కంపెనీ మార్కెట్ వాల్యూ తీవ్ర కుదుపులకు లోనైంది. రూ.10 లక్షల కోట్ల కంపెనీ ఉన్న రిలయన్స్ ఈ సాయంత్రానికి రూ.7.05 లక్షల కోట్లకు పడిపోయింది. దాంతో ప్రముఖ దేశీయ సాఫ్ట్ వేర్ దిగ్గజం టీసీఎస్ భారత్ లో నెంబర్ వన్ కంపెనీగా అవతరించింది. మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా టీసీఎస్ సంస్థకు కూడా నష్టాలు వాటిల్లినా అది స్వల్పమే కావడంతో రూ.7.40 లక్షల కోట్లతో భారత్ లో అత్యంత విలువైన కంపెనీగా అగ్రస్థానానికి చేరింది. టీసీఎస్ షేర్ వాల్యూ 6 శాతానికి పైగా పతనమైనా రిలయన్స్ కంపెనీ షేర్ల పతనంతో పోలిస్తే చాలా తక్కువ.