మంత్రి పెద్దిరెడ్డిపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
- పుంగనూరులో వైసీపీ బెదిరింపులకు పాల్పడుతోంది
- టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వరా?
- ‘పంచాయతీరాజ్ శాఖ మంత్రికి సిగ్గుందా?’
ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ బెదిరింపులకు సంబంధించిన ఓ వీడియోను ప్లే చేసి చూపించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పుంగనూరులో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వారిని బెదిరిస్తున్నారని, వైసీపీ నేతల అరాచకాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పంచాయతీరాజ్ శాఖ మంత్రికి సిగ్గుందా?’ అంటూ ధ్వజమెత్తిన చంద్రబాబు, ఆ పదవిలో ఉండటానికి పెద్దిరెడ్డి అనర్హుడని, ఆయన్ని వెంటనే అరెస్టు చేయాలని, పుంగనూరు ఘటనకు ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపు నిచ్చారు. వైసీపీ నేతలు మామూలు మనుషులుగా ప్రవర్తించాలంటే ఈ ఎన్నికల్లో తగినబుద్ధి చెప్పాలని, అప్పుడే కంట్రోల్ అవుతారని, లేకపోతే, ఇంకా రెచ్చిపోయి ఈ రాష్ట్రాని ఇంకా అతలాకుతలం చేస్తారని చెప్పారు. రాజధాని ప్రాంత ప్రజానీకం ఇన్ని రోజులుగా నిరసనలు తెలుపుతుంటే, ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందని అన్నారు.