దుబాయ్ నుంచి వచ్చి కరోనా టెస్టు ఎగ్గొట్టిన వ్యక్తి కోసం కర్ణాటకలో వేట
- దుబాయ్ నుంచి మంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్న వ్యక్తి
- అధిక జ్వరంతో బాధపడుతుండడంతో కరోనాగా అనుమానం
- వైద్యపరీక్షలు చేయించుకోమనడంతో ఎయిర్ పోర్టు నుంచి అదృశ్యం
కరోనా లక్షణాలతో దుబాయ్ నుంచి కర్ణాటక వచ్చిన ఓ వ్యక్తి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోకుండా పారిపోవడం తీవ్ర కలకలం రేపింది. తాజాగా ఆ వ్యక్తి దుబాయ్ నుంచి మంగళూరు చేరుకున్నాడు. అయితే అప్పటికే తీవ్ర జ్వరం, దగ్గు తదితర లక్షణాలతో బాధపడుతున్నాడు. దాంతో అతడిని కరోనా అనుమానితుల జాబితాలో ఉంచి మంగళూరులోని వెల్నాక్ ఆసుపత్రిలో వైరస్ పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావించారు.
అయితే ఆ వ్యక్తి వైద్యపరీక్షలు చేయించుకోకుండా ఎయిర్ పోర్టు నుంచి అదృశ్యమయ్యాడు. దాంతో అధికారులు ఆ ప్రయాణికుడి గురించి పోలీసులకు సమాచారం అందించారు. ఇప్పుడతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. పోలీసులు అతడి నివాసం వద్ద ఓ నిఘా బృందాన్ని మోహరించారు. అతడు వస్తే అట్నుంచి అటే ఆసుపత్రికి తరలించాలని పోలీసులు భావిస్తున్నారు.