మోపిదేవి, సుభాష్ చంద్రబోస్ లకు బీసీ కోటాలో రాజ్యసభ సీట్లు ఇచ్చాం: ఉమ్మారెడ్డి

  • ఏపీలో నలుగురు సభ్యుల కోసం రాజ్యసభ ఎన్నికలు
  • నలుగురి పేర్లను ఖరారు చేసిన వైసీపీ
  • బీసీలకు 50 శాతం అవకాశాలు ఇవ్వాలనుకున్నామని ఉమ్మారెడ్డి వెల్లడి
ఏపీలో నలుగురు రాజ్యసభ సభ్యుల కోసం ఎన్నికలు జరగనుండగా, వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి ఏపీ నుంచి మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీలకు అవకాశం ఇచ్చారు. దీనిపై ఆ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వివరణ ఇచ్చారు.

రాజ్యసభలో 50 శాతం మేర బీసీలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించామని, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లను బీసీ కోటాలోనే రాజ్యసభకు పంపుతున్నామని చెప్పారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ అభ్యర్థన మేరకు పరిమళ్ నత్వానీకి రాష్ట్రం నుంచి రాజ్యసభకు అవకాశం కల్పించామని వెల్లడించారు.


More Telugu News