మేం హీరోలమైనా లాబీయింగ్ చేసేవాళ్ల ముందు జీరోలమయ్యాం: జగ్గారెడ్డి
- కాంగ్రెస్ కు సొంత నేతలతోనే ఎక్కువ నష్టం జరుగుతోందన్న జగ్గారెడ్డి
- సోనియా ఇప్పటికైనా పట్టించుకోవాలని విజ్ఞప్తి
- లాబీయింగ్ తెలంగాణ కాంగ్రెస్ కు శాపం అని ఆవేదన
కాంగ్రెస్ పార్టీలో ఏ స్థాయిలో అయినా వర్గపోరు సర్వసాధారణం. రాష్ట్రాల్లో ఈ పరిస్థితి తీవ్ర స్థాయిలో కనిపిస్తుంది. రాష్ట్ర పరిశీలకుల ముందే బాహాబాహీకి దిగి చొక్కాలు చింపుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలు అందుకు మినహాయింపు కాదు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీల కంటే సొంత పార్టీ వాళ్లతోనే ఎక్కువ నష్టం కలుగుతోందని జగ్గారెడ్డి అన్నారు. సోనియా గాంధీ ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ గురించి పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాము హీరోలమే అయినా, ఢిల్లీలో పార్టీ హైకమాండ్ వద్ద లాబీయింగ్ చేసేవారి ముందు జీరోలుగా మిగిలిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని కలవకుండా వీహెచ్ వంటి సీనియర్ నేతలను కూడా అడ్డుకుంటున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఈ లాబీయింగ్ హీరోలు తెలంగాణ కాంగ్రెస్ కు శాపం అని పేర్కొన్నారు.