ఏపీలో మూడు కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించట్లేదు: ఈసీ రమేశ్​ కుమార్​

  • ఏపీలో 12 కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహిస్తున్నాం
  • కొన్ని వివాదాల కారణంగా 3 చోట్ల ఎన్నికలు జరపట్లేదు
  • కొన్ని పురపాలికల్లోనూ, పామిడి నగరపంచాయతీలో కూడా
ఏపీలో 12 కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహిస్తున్నామని, కొన్ని వివాదాల కారణంగా మూడు కార్పొరేషన్లలో మాత్రం జరపడం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ వెల్లడించారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శ్రీకాకుళం, నెల్లూరు, రాజమహేంద్రవరంలో ఎన్నికలు జరపడం లేదని తెలిపారు.

కోర్టు కేసులు, ఇతర వివాదాల కారణంగా తణుకు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, భీమవరం, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, నరసరావుపేట, బాపట్ల, మంగళగిరి, తాడేపల్లి, పొన్నూరు, గురజాల, దాచేపల్లి, కందుకూరు, దర్శి, రాజాం, ఆముదాలవలస, బుచ్చిరెడ్డిపాలెం, గూడూరు, కావలి, శ్రీకాళహస్తి పురపాలికల్లో, పామిడి నగరపంచాయతీకి ఎన్నికలు నిర్వహించడం లేదని వివరించారు.


More Telugu News