రాహుల్ సిప్లిగంజ్ కు ఎవరూ లేరని అనుకోవద్దు: ప్రకాశ్ రాజ్
- రాహుల్ వెనక మేమంతా ఉన్నాం
- బీర్ బాటిల్ తో కొట్టి చంపేస్తారా?
- తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే
సినీ గాయకుడు, బిగ్ బాస్-3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రిషిక్ రెడ్డి గచ్చిబౌలిలోని పబ్ లో దాడి చేసిన సంగతి తెలిసిందే. తలపై బీర్ బాటిల్ తో కొట్టడంతో.. రాహుల్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే పబ్ నిర్వాహకులు రాహుల్ ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత తనపై జరిగిన దాడిపై పోలీసులకు రాహుల్ ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలంటూ మంత్రి కేటీఆర్ ను కూడా ట్విట్టర్ ద్వారా కోరాడు.
మరోవైపు రాహుల్ సిప్లిగంజ్ కు సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మద్దతు పలికారు. రాహుల్ తో కలిసి ఈరోజు టీఆర్ఎస్ నేత వినయ్ భాస్కర్ ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ కు ఎవరూ లేరని అనుకోవద్దని... తామంతా ఆయన వెనక ఉన్నామని చెప్పారు. పబ్ కు వెళ్లడంలో తప్పు లేదని అన్నారు. కొట్టి చంపేస్తారా? అంటూ దాడి చేసిన వారిని ఉద్దేశించి ప్రశ్నించారు. జరిగిన గొడవలో రాహుల్ తప్పు లేదని... దాడి చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని చెప్పారు. వినయ్ భాస్కర్ ను కలవడానికి, ఈ కేసుకు సంబంధం లేదని తెలిపారు. కేసు కాంప్రమైజ్ కోసం వినయ్ భాస్కర్ ను కలవాల్సిన అవసరం లేదని... రాహుల్ తప్పు చేయనప్పుడు కాంప్రమైజ్ అనే ప్రశ్న అనవసరమని చెప్పారు.