ట్రైలర్ తోనే ఆసక్తిని రేకెత్తిస్తోన్న జేడీ చక్రవర్తి

  • జీడీ చక్రవర్తి నుంచి  'ఎమ్ ఎమ్ ఓ ఎఫ్' 
  • దర్శకుడిగా ఎన్. ఎస్.సి. ప్రయోగం 
  • అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు
ఇటీవల కాలంలో జేడీ చక్రవర్తి విలక్షణమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు. అలా ఆయన చేసిన 'ఎమ్ ఎమ్ ఓ ఎఫ్' సినిమా విడుదలకి ముస్తాబవుతోంది. జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రధారిగా నిర్మితమైన ఈ సినిమాకి, ఎన్.ఎస్.సి. దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

జేడీ వాయిస్ ఓవర్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించేలా వుంది. ఒక ప్రమాదంలో చిక్కుకున్న ఆయన అక్కడి నుంచి బయటపడాలనుకుంటాడు. తనకన్నా పెద్ద ప్రమాదంలో తన చెల్లెలు ఉందనే విషయాన్ని ఆ సమయంలోనే ఆయన గ్రహిస్తాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? అన్నా చెల్లెళ్లను చుట్టుముట్టిన ఆ ప్రమాదం ఏమిటి? అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుందనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. అంచనాలు పెంచుతున్న ఈ సినిమా జేడీకి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి


More Telugu News