హీరోగా నేను వెనకబడిపోవడానికి అదో కారణం: హీరో వెంకట్

  • డూప్ లేకుండా జంప్ చేశాను 
  • ఆ సినిమా షూటింగులో గాయపడ్డాను
  • కోలుకోవడానికి 3 నెలలు పట్టిందన్న వెంకట్  
'శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన వెంకట్, తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమాలో ఆయనను చూసిన ప్రేక్షకులు, హీరోగా బాగా బిజీ అవుతాడని అనుకున్నారు .. కానీ అలా జరగలేదు.

ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .."ఒక సినిమాలో నేను పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నాను. సహజత్వం కోసం నేను డూప్ లేకుండా పై నుంచి జంప్ చేశాను. అక్కడి నుంచి పడిపోవడం వలన నా వెన్నెముకకు గాయమైంది. షూటింగుకి అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో ఆ విషయాన్ని బయటికి రానీయలేదు. ఆ గాయం కారణంగా నేను 3 నెలలపాటు బెడ్ రెస్ట్ తీసుకోవలసి వచ్చింది. ఆ గాయం బాధ పెడుతుండటం వలన నేను ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను. ఇక పారితోషికం మరీ తక్కువగా ఇస్తామని చెప్పడం వలన కూడా కొన్ని అవకాశాలను వదులుకోవలసి వచ్చింది" అని చెప్పుకొచ్చాడు.


More Telugu News