తమకు జరిగిన అన్యాయంపై బీసీలు తగిన విధంగా బుద్ధి చెప్పాలి: రామానాయుడు

  • వైసీపీ సర్కారు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆరోపణలు
  • గెలిచే అవకాశాల్లేని చోట ఎన్నికలు వాయిదా వేస్తున్నారని ఆగ్రహం
  • ఎన్నికల సంఘం ఏం చేస్తోందంటూ ప్రశ్నించిన రామానాయుడు
స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశం నేపథ్యంలో టీడీపీ నేత నిమ్మల రామానాయుడు తీవ్రంగా స్పందించారు. ఎన్నికల నిబంధనలను వైసీపీ ప్రభుత్వం యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ఓవైపు కోడ్ ఉల్లంఘన జరుగుతుంటే ఎన్నికల సంఘం నిద్రపోతోందా? అని ప్రశ్నించారు. గెలిచే అవకాశం లేని చోట ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల కోసం రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించిన సీఎం జగన్, వాటికి ఇన్ చార్జిలుగా రెడ్లనే నియమించారని విమర్శించారు. తమకు జరిగిన అన్యాయంపై బీసీలు తగిన విధంగా బుద్ధి చెప్పాలని అన్నారు.


More Telugu News