బేర్ గ్రిల్స్ తో రజనీకాంత్ సాహసాలు... ట్రైలర్ ఇదిగో!

  • రజనీతో ఇంటూ ద వైల్డ్ స్పెషల్ ఎపిసోడ్ రూపొందించిన బేర్ గ్రిల్స్
  • మార్చి 23న రాత్రి 8 గంటలకు డిస్కవరీ చానల్లో ప్రసారం
  • తాజాగా ట్రైలర్ విడుదల
ప్రపంచ సాహసికుడు బేర్ గ్రిల్స్ ప్రముఖులను కూడా తన వెంట కొండకోనల్లో, దట్టమైన అరణ్యాల్లో తిప్పుతూ చేసే అడ్వెంచరస్ కార్యక్రమం 'ఇంటూ ద వైల్డ్'. డిస్కవరీ చానల్ కోసం తానొక్కడే 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' పేరిట సింగిల్ ఎపిసోడ్లు రూపొందించే బేర్ గ్రిల్స్ అప్పుడప్పుడు వరల్డ్ సెలబ్రిటీలను తన వెంటేసుకుని తిప్పుతూ 'ఇంటూ ద వైల్డ్' పేరిట స్పెషల్ డాక్యుమెంటరీలు చిత్రీకరిస్తుంటాడు. ఇంతకుముందు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోదీలతోనూ 'ఇంటూ ద వైల్డ్' స్పెషల్ ఎపిసోడ్లు చేసిన ఈ బ్రిటీష్ మాజీ సైనికుడు తాజాగా దక్షిణాది సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ తో కర్ణాటక బండిపుర అరణ్యాల్లో సాహసాలు చేశాడు.

'ఇంటూ ద వైల్డ్... రజనీ విత్ బేర్ గ్రిల్స్' ఎపిసోడ్ డిస్కవరీ ఇండియా చానల్లో ఈ నెల 23న రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్రైలర్ రిలీజైంది. ఇందులో రజనీ తన స్టయిల్ ను మిస్ కాకుండా చూసుకోవడమే కాదు, బేర్ గ్రిల్స్ విస్మయపడేలా సినిమాకు తీసిపోని అడ్వెంచర్లు చేశాడు. చివర్లో కళ్లద్దాలను ఎంతో చాతుర్యంతో తిప్పుతూ ధరించడం హైలైట్.


More Telugu News